Friday, March 20, 2026
Homeసినిమాప్రభాస్ ఆ ఛాన్స్ ఇచ్చేది ఎవరికి..?

ప్రభాస్ ఆ ఛాన్స్ ఇచ్చేది ఎవరికి..?

ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న’ఆదిపురుష్’ పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న ‘సలార్’ మూవీ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది. మార్చిలో క్లైమాక్స్ చిత్రీకరించనున్నారు. మరో వైపు ‘ప్రాజెక్ట్ కే’, మారుతితో చేస్తున్న సినిమాల షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం జూన్ 16న ఆదిపురుష్‌ రిలీజ్ కానుంది. ఆతర్వాత సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుంది. మూడు నెలల గ్యాప్ లోనే ప్రభాస్ నుంచి రెండు సినిమాలు వస్తుండడం విశేషం.

అయితే.. మారుతితో చేస్తున్న హర్రర్ కామెడీ మూవీ విషయంలో కన్ ఫ్యూజన్ నెలకొంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా ఒక ప్యాలస్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీకి రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల ఆఖరులో జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు జరిగిన షూట్ చేసి ప్రభాస్ చాలా హ్యాపీగా ఫీలయ్యారని తెలిసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ దర్శకుడి విషయంలో మారుతి కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం తమన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తమన్ కూడా మారుతితో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారట. మరో వైపు అనిరుద్ రవిచంద్రన్ ని కూడా తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేయడం ఖాయం కానీ.. ఎవరిని ఫైనల్ చేయాలనే విషయం పై మారుతి ఇప్పటి వరకు క్లారిటీకి రాలేదు. దీంతో సినిమా షూటింగ్ జరుగుతున్న ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విషయం మాత్రం సస్పెన్స్ గా మారింది. మరి.. ప్రభాస్, మారుతి మూవీకి మ్యూజిక్ చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular