Saturday, November 23, 2024
HomeసినిమాR. P. Patnaik: 'అహింస', జయం మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయం - ఆర్పీ పట్నాయక్...

R. P. Patnaik: ‘అహింస’, జయం మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయం – ఆర్పీ పట్నాయక్  

ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తేజ. ఇప్పుడు తేజ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అహింస’. ఈ చిత్రంతో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై చాలా క్యూరియాసిటీని పెంచింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అందించిన ‘అహింస’ పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా అలరిస్తున్నాయి. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..

సినిమా వున్నా లేకపోయినా రోజుకి 18 గంటలు పని చేస్తాను. కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే దర్శకత్వంకు సంబధించిన కొన్ని కథలు రాస్తున్నాను. అయితే నాకు మ్యూజిక్ ఎక్కువ పేరు తీసుకొచ్చింది కానీ ఒక సందర్భంలో మానేశాను. అయితే.. బాలు గారు నేను ఎక్కడ కనిపించినా ‘మళ్ళీ సంగీతం ఎప్పుడు మొదలు పెడుతున్నావ్ ‘అని అడిగేవారు. అడిగిన ప్రతిసారీ ‘చేస్తాను గురువు గారు’ అని చెప్పేవాడిని. సమస్య ఏమిటంటే నాకు కథ నచ్చితేనే చేస్తాను. మధ్యలో చాలా వచ్చాయి కానీ చేయాలనిపించలేదు. బాలు గారు వెళ్లిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చలేక పోయాననే గిల్ట్ ఎక్కువైపోయింది. బాలు గారు నాకు స్ఫూర్తి. ఆయన పాట పై వున్న అభిమానంతో పరిశ్రమలోకి వచ్చాను. ఆయనకి ఇచ్చిన మాట తీర్చలేక పోయాననే బాధ ఎక్కువైంది. ఈ క్రమంలో ఒకసారి తేజ గారిని కలవడం జరిగింది. ‘మళ్ళీ మ్యూజిక్ చేయాలి. అది బాలు గారి కోరిక’ అని తేజ గారికి చెప్పాను. కొన్ని రోజుల తర్వాత తేజ గారు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం అని చెప్పారు. అదే ‘అహింస’.

అహింస కథ చాలా కొత్తది, నేపధ్య సంగీతం చేసేటప్పుడు చూశాను. చాలా కొత్తగా వుంటుంది. కథ కొత్తగా ఉన్నప్పుడు సంగీతం కూడా సహజంగానే కొత్తగా వినిపిస్తుంది. నేను ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వలేదు. సినిమాకి ఏం కావాలో దాని పై దృష్టి పెట్టాను. ట్రెండ్ అనేది ప్రత్యేకంగా వుండదని నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఇచ్చేది జనాలకు నచ్చితే అదే ట్రెండ్. అహింస పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఇంకా రావాలి. రిలీజ్ తర్వాత అది ఇంకా పెరుగుతుందని భావిస్తున్నాను. జయం సినిమాలో ప్రియతమా పాట సినిమా విడుదల తర్వాత మరో స్థాయికి వెళ్ళింది. అహింస కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయం. తేజ గారు, నా కాంబోలో  ఏ రేంజ్ మ్యూజిక్ ఇవ్వాలో ఆ రేంజ్ మ్యూజిక్ చేశాం.

ఇక నుంచి మ్యూజిక్ చేస్తాను. అయితే మరీ చిన్న సినిమాలు చేయను. మ్యూజిక్ ఖర్చు పెరిగింది. సింగర్స్, కీబోర్డ్ ప్లేయర్స్.. ఇలా అందరి రెమ్యునిరేషన్ పెరిగాయి.  నటన విషయానికి వస్తే.. చాలా మంది దర్శకులు సంప్రదిస్తున్నారు. అయితే నేను ఇంకా మెంటల్ గా ప్రిపేర్ కాలేదు. ఒక మంచి వెబ్ సిరీస్ వస్తే చేయాలని వుంది. నా దర్శకత్వంలో  నెక్స్ట్ ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఎలక్షన్ మీద ఒక కథ వుంది. నిర్మాత దొరికితే ఎలక్షన్ సినారియో మారిపోతుంది. బ్రోకర్ అందులో ఒక శాతమే. అలాగే వెబ్ సిరీస్ కోసం కూడా ఓ రెండు కథలు రాశాను

RELATED ARTICLES

Most Popular

న్యూస్