Tuesday, June 16, 2026
HomeసినిమాCharan: అఖిల్, పవన్ తో మూవీ ప్లాన్ చేస్తున్న చరణ్‌..?

Charan: అఖిల్, పవన్ తో మూవీ ప్లాన్ చేస్తున్న చరణ్‌..?

రామ్ చరణ్‌ కొత్తగా వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారని వార్త బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ మూవీ అక్కినేని అఖిల్ తో ఉంటుందని ప్రచారం జరిగింది. చరణ్, అఖిల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి… ఇది నిజమే అనుకున్నారు. అయితే.. అఖిల్ తో కాకుండా నిఖిల్ తో చరణ్‌ మూవీని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. అయితే.. అఖిల్ తో కూడా మూవీ ఉందట. ఈ భారీ పాన్ ఇండియా మూవీని త్వరలోనే ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిల్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని టాక్ వినిపిస్తుంది.

నిఖిల్, అఖిల్ తో పాటు బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కూడా చరణ్‌ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అసలు పవన్, చరణ్ కాంబో మూవీ ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఓ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బ్యానర్ లో పవన్ హీరోగా చరణ్‌ ఓ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేశారు. కొన్ని కారణాల వలన కుదరలేదు. ఈసారి మాత్రం వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై ఖచ్చితంగా పవర్ స్టార్ తో సినిమా నిర్మించాలి అనుకుంటున్నారు. అయితే.. పవన్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. కమిట్ మెంట్స్ పూర్తైన తర్వాత అబ్బాయ్ బ్యానర్ లో బాబాయ్ మూవీ ఉంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular