Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రైవేటు పరం కానివ్వం: ఎంవివి

ప్రైవేటు పరం కానివ్వం: ఎంవివి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేస్తామని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ విషయమై సంబంధిత కేంద్ర మంత్రులను, అధికారులను కలుస్తామని చెప్పారు. కార్మికులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. జంతర్ మంతర్ రోడ్డులో కార్మికులు చేపట్టే  ధర్నాకు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నట్లు వివరించారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 153వ రోజుకు చేరుకున్నాయి. లోక్ సభ సభ్యుడు సత్యనారాయణ దీక్ష శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వబోమని స్పష్టం చేశారు. రేపు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ ఎంపీల సమావేశం ఉందని, స్టీల్ ప్లాంట్ విషయంలో పార్లమెంట్ లో ఎలా పోరాటం చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్