Saturday, January 18, 2025
Homeసినిమాగతానికీ .. వర్తమానానికి మధ్య నలిగే 'పర్ఫెక్ట్ హస్బెండ్'

గతానికీ .. వర్తమానానికి మధ్య నలిగే ‘పర్ఫెక్ట్ హస్బెండ్’

సీనియర్ స్టార్ హీరోలు .. హీరోయిన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. అలా సత్యరాజ్ – సీత ప్రధానమైన పాత్రలను పోషించిన సిరీస్ గా ‘మై పెర్ఫెక్ట్ హస్బెండ్’ కనిపిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రీసెంటుగా ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. 8 ఎపిసోడ్స్ గా సాగే ఈ సిరీస్ కి తమిరా దర్శకత్వం వహించాడు. టైటిల్ ను బట్టే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమైపోతుంది. విద్యాసాగర్ ఈ సిరీస్ కి సంగీతాన్ని అందించాడు.

చాలామంది భార్యలు .. తమ భర్త మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడకూడదనే భావిస్తారు. తమని మాత్రమే ఆరాధించాలనీ .. తమ గురించి మాత్రమే ఆలోచించాలని కోరుకుంటారు. వాళ్ల సంతోషానికి తగినట్టుగా నడచుకోవడానికే చాలామంది భర్తలు ప్రయత్నిస్తూ ఉంటారు. తమ భర్త ప్రేమ తమకి మాత్రమే సొంతమనే ఒక నమ్మకం కంటే, ఒక ఇల్లాలికి ఈ ప్రపంచంలో ఆనందాన్ని కలిగించే విషయమేదీ ఉండదు.

అంతటి నమ్మకం పెట్టుకున్న ఒక ఇల్లాలికి, తన భర్త కాలేజ్ రోజులనాటి ప్రేమవ్యవహారం తెలిస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రేమను ఆయన ఇప్పటికీ మరిచిపోలేదని గ్రహించినప్పుడు ఏం చేస్తుంది? అనే కథతో రూపొందినదే  ‘మై పర్ఫెక్ట్ హస్బెండ్’. టైటిల్ కి తగినట్టుగా ఈ సిరీస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా చూడొచ్చు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలుగానీ .. సంభాషణలుగాని లేవు. కాకపోతే నిదానంగా సాగే కథాకథనాలు కాస్త ఓపికతో ఫాలో కావాలంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్