Wednesday, October 4, 2023
HomeTrending NewsTTD Chairman: నేను చేసిన పనులే సమాధానం: భూమన

TTD Chairman: నేను చేసిన పనులే సమాధానం: భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా తన నియామకంపై వస్తోన్న విమర్శలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.  17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినని, ఇప్పుడు 8 కోట్లమంది వీక్షిస్తోన్న ఎస్వీబీసీ చానెల్ తన బుర్రలో పుట్టిన ఆలోచన అని,  శ్రీవారి దయతో మతాంతీకరణలు ఆపడానికి 32 వేలమంది సామాన్యులకు  కళ్యాణమస్తు ద్వారా పెళ్ళిళ్ళు చేయించిన ఆలోచన తనదేనన్నారు. తన సోదరుడు భూమన సుబ్రమణ్యం (భూమన్) పుట్టినరోజు సందర్భంగా తిరుపతి మానవ వికాస వేదిక ప్రచురించిన ‘మూడు తరాల మనిషి భూమన్’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కరుణాకర్ రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు.

వేద విశ్వ విద్యాలయాన్ని స్థాపించడంలో అత్యంత కీలకపాత్ర పోషించానని,  తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది… అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ…. దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది… తానేనని,   క్రిస్టియన్ అని నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానమని స్పష్టం చేశారు.

వివాదాలకు భయపడి రాజకీయాల్లో కొనసాగే వ్యక్తిని తాను కాదని, ఈ విషయం తనను విమర్శించే వారికి కూడా తెలుసనీ,  విప్లవ రాజకీయాల నుంచి ఉద్భవించిన వాళ్ళమని, పోరాటాల నుండి పైకి వచ్చిన వాడినని విమర్శలకు భయపడి మంచి పనులు చేయడం ఆపబోనని తేల్చి చెప్పారు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న