జాతీయ అవార్డులు రావడం చాలా గర్వంగా వుంది – మైత్రీ నిర్మాతలు

అల్లు అర్జున్ గారికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం, అందులోనూ మేము నిర్మించిన ‘పుష్ప’ చిత్రానికి ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా వుంది. ఇదొక చరిత్రగా నిలిచిపోతుంది. అలాగే ‘ఉప్పెన’ చిత్రం, దేవిశ్రీ ప్రసాద్ గారికి జాతీయ అవార్డులు రావడం చాలా అనందంగా వుంది అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్.

ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ… అల్లు అర్జున్ గారి జాతీయ అవార్డ్ రావడం మాకు ఎంతో అనందంగా గర్వంగా వుంది. పుష్ప సినిమా షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ గారు తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్ గారు అనేవారు. అది ఈ రోజు నిజమైయింది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి జాతీయ అవార్డ్ రావడం ఆనందంగా వుంది. పుష్ప మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేవిశ్రీ మాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే ఉప్పెన సినిమాకి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డ్ రావడం గర్వంగా వుంది. దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్ కృతి శెట్టి , విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్, టీం అందరికీ అభినందనలు. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రానికి  ఆరు అవార్డులు రావడం సంతోషంగా వుంది. జాతీయ అవార్డు విజేతలు అందరికీ పేరుపేరునా అభినందనలు” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *