Thursday, March 12, 2026
Homeసినిమాసుధీర్ బాబు సినిమాకు మైత్రీ మూవీమేకర్స్ భాగస్వామ్యం

సుధీర్ బాబు సినిమాకు మైత్రీ మూవీమేకర్స్ భాగస్వామ్యం

Sudheer- Mythri: హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్‌ ను ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు నిర్మాణ భాగ‌స్వామిగా ఆహ్వానించడం గర్వంగా ఉందని మెంచ్ మార్క్ స్టూడియోస్ ప్రకటించింది.

రొమాంటిక్ ఎంటర్టైనర్, అందమైన ప్రేమ కథగా రాబోతోన్న ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌ లోకి రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను త్వరలోనే చిత్రయూనిట్ విడుదల చేయనుంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. పీజీ విందా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్ట‌ర్, మార్తాండ్ కే వెంకటేష్‌ ఎడిట‌ర్‌. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : నాకు ఆ ఆలోచన లేదు : హీరోయిన్ కృతి శెట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular