Friday, March 20, 2026
Homeసినిమాధనుష్ మూవీలో నాగ్ ఉన్నట్టా? లేనట్టా?

ధనుష్ మూవీలో నాగ్ ఉన్నట్టా? లేనట్టా?

ధనుష్‌ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో భారీ, క్రేజీ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. చాలా రోజుల కసరత్తు తర్వాత ఈ సినిమాను అనౌన్స్ చేసినా ధనుష్ వేరే సినిమాల్లో బిజీ కావడంతో దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా.? అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆఖరికి కథ సెట్ అయ్యింది. ధనుష్ కి చెబితే ఓకే చెప్పడంతో ఈ భారీ, క్రేజీ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

అయితే.. ఈ సినిమాలో నాగార్జున నటించనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. నాగార్జున, శేఖర్ కమ్ముల ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. అక్కినేని కాంపౌండ్ లో అమలతో ‘లైఫ్‌ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీ చేశాడు. నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’  తెరెకెక్కించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మరింతగా అనుబంధం ఏర్పడింది.. ఇద్దరూ కలిసి సినిమా కూడా చేయాలనుకున్నారు.

అందుచేత ఇప్పుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి నాగ్ కి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. అయితే… నాగార్జున ప్రస్తుతం 99వ సినిమా చేస్తున్నారు. మరో వైపు బిగ్ బాస్ 7కు హోస్ట్ గా కూడా చేయనున్నారు. ఆతర్వాత 100వ సినిమా చేయాలి అనుకుంటున్నారు. అందుచేత ఈ సినిమా చేయలా..? వద్దా..? అని బాగా ఆలోచిస్తున్నారట. తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదట. ఓ వారం రోజుల్లో చెబుతాను అన్నారట. మరి.. శేఖర్ కమ్ములకి నాగ్ ఎస్ చెబుతారో..? నో చెబుతారో..? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular