Sunday, June 2, 2024
Homeసినిమా'దేవర'పై పుకార్లకు చెక్

‘దేవర’పై పుకార్లకు చెక్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్, విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తుండడం విశేషం. ఎన్టీఆర్, సైఫ్ లపై యాక్షన్ ఎపిసోడ్ ను ఇటీవల రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు.

‘దేవర’ను ఇంగ్లీషు వెర్షెన్ లో కూడా విడుదల చేయాలనుకుంటున్నట్లు ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.  సోషల్ మీడియాలో  బాగా వైరల్ అయ్యింది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.  ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అవాస్తవాలను ప్రచారం చేసి కన్ ఫ్యూజ్ చేయద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నవంబర్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. డిసెంబర్ నుంచి ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దేవర పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా షూటింగ్ స్టార్ట్ కాకుండానే ప్రకటించడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్