Monday, June 15, 2026
Homeసినిమాఅవకాశాల కోసమే అందాల భామ వెయిటింగ్!

అవకాశాల కోసమే అందాల భామ వెయిటింగ్!

టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయమవుతూనే ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చినవారిలో కొంతమంది మాత్రమే యూత్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తారు .. మాస్ ఆడియన్స్ మనసులను దోచేస్తారు .. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకువెళతారు. అలాంటి కథానాయికలలో నభా నటేశ్ ఒకరుగా చెప్పుకోవచ్చు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో నభా ఇక్కడ అడుగుపెట్టింది. ఫస్టు సినిమాతోనే హిట్ ను అందుకుంది. కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టడమే కాకుండా, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.

అలా పూరి దర్శకత్వంలో రామ్ జోడీగా నభా చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమె కెరియర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తూ ఆమె అందాల సందడి చేసింది. దాంతో ఆమె అభిమానుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే స్థాయిలో ఆమెకి వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. రవితేజ .. నితిన్ .. సాయిధరమ్ తేజ్ .. బెల్లంకొండ శ్రీనివాస్ లతో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియాన్స్ ను మెప్పించలేకపోయాయి.

ఈ నేపథ్యంలోనే నభా గ్యాప్ తీసుకుంది .. అందుకు కారణం తనకి జరిగిన ఒక ప్రమాదమని ఆ మధ్య ఆమెనే చెప్పింది. అయితే ఆల్రెడీ ఆమె పూర్తిగా కోలుకుని.. మునుపటి ఫిట్ నెస్ కి వచ్చేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ, తాను సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాననే సంకేతాలు పంపుతోంది. చిన్న సినిమాలతో కొత్త హీరోయిన్స్ తెరపైకి దూసుకొస్తున్న ఈ సమయంలో, నభాకు ఎంతవరకూ అవకాశాలు వెళతాయనేది చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular