Friday, March 29, 2024
Homeసినిమానాగ్ తో పోటీకి సై అంటున్న మంచు విష్ణు

నాగ్ తో పోటీకి సై అంటున్న మంచు విష్ణు

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఈ చిత్రానికి ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట‌ర్. ఇందులో నాగ్ స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇందులో నాగార్జున‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూపించ‌ని విధంగా స‌రికొత్త‌గా చూపిస్తున్నాను అని ప్ర‌వీణ్ స‌త్తారు చెప్ప‌డంతో ఆడియ‌న్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. దీనికి తోడు ఈ మూవీ టీజ‌ర్ ట్రెమండ‌స్ గా ఉండ‌డంతో ది ఘోస్ట్ మూవీ పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇక ద‌స‌రాకి కానుక‌గా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీ కూడా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. గాడ్ ఫాద‌ర్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. మంచు విష్ణు న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ జిన్నా. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జిన్నా టైటిల్ పెట్ట‌డం వివాద‌స్ప‌దమైన విషయం తెలిసిందే.

ఈ సినిమా నుంచి ఇంత వరకూ వచ్చిన అప్ డేట్స్ చాలా తక్కువ. అయితే.. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా సోష‌ల్ మీడియా ద్వారా ఒక హింట్ ఇచ్చాడు విష్ణు. దాదాపు ఈ సినిమా ఆ రోజునే వస్తుందని అనుకోవచ్చు. దీంతో నాగార్జున ది ఘోస్ట్, విష్ణు జిన్నా సినిమాల మ‌ధ్య పోటీ ఖాయం అనిపిస్తుంది.

Also Read : క్యూరియాసిటీ పెంచుతున్న ‘జిన్నా’ ఫస్ట్ లుక్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్