Saturday, January 18, 2025
Homeసినిమాఅవన్నీ పుకార్లే నండోయ్: 'కల్కి' డైరెక్టర్!

అవన్నీ పుకార్లే నండోయ్: ‘కల్కి’ డైరెక్టర్!

ప్రభాస్ ‘కల్కి’ సినిమా వసూళ్ల పరంగా ఒక సునామీనే సృష్టించింది. అయితే కంటెంట్ పరంగా కొన్ని విమర్శలు వచ్చాయి కూడా. అశ్వద్ధామ .. అర్జునుడు .. కర్ణుడు .. అంటూ ఈ గోలంతా లేకుండా, కలి పురుషుడికీ .. కల్కికి మధ్య జరిగే యుద్ధంగా ఈ సినిమాను చూపిస్తే కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక అసలు ఈ కథ అంతా నేలపై జరుగుతుందా .. నేలకి .. ఆకాశానికి మధ్య జరుగుతుందా? అనే అయోమయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేయడం కనిపించింది.

ఈ సినిమాలో ఒక సందర్భంలో విజయ్ దేవరకొండ .. దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. ఇద్దరివీ కూడా పెద్దగా ప్రాముఖ్యత కలిగిన పాత్రలేమీ కాదు. తెరపై ఒకటి రెండుసార్లు కనిపిస్తారంతే. అయితే కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. విజయ్ దేవరకొండ – దుల్కర్ ఈ ఇద్దరూ సెకండ్ పార్టులోను కనిపిస్తారనీ, వారి పాత్రకి సంబంధించిన నిడివి ఎక్కువగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దాంతో చాలామంది సందేహంలో పడ్డారు. ఇది నిజమా .. కాదా తేల్చుకోలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ .. ఇవన్నీ పుకార్లు మాత్రమేనని తేల్చి చెప్పారు. సెకండ్ పార్టులో దుల్కర్ పాత్ర కీలకంగా మారనుందనీ, ప్రతినాయకుడిపై ప్రభాస్ సాగించే పోరాటంలో విజయ్ దేవరకొండ సాయపడతాడనే వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు. తాము తయారు చేసుకున్న కథ వేరే ఉందనీ, అదేమిటన్నది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయవలసిందేనని అన్నారు. మరి ఈ భాగంలో కనిపించిన కొన్ని లోపాలను సెకండ్ పార్టులో సరిచేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్