Monday, July 8, 2024
Homeసినిమా'మహాభారతం' రాజమౌళి తీస్తేనే బాగుంటుంది

‘మహాభారతం’ రాజమౌళి తీస్తేనే బాగుంటుంది

‘మహాభారతం’ అనేక కథల సముదాయం .. అనేక పాత్రల సమాహారం. అందువలన ఒక పుస్తకంలో దాని గురించి రాయడం కష్టం .. ఒక సినిమాగా అంత కంటెంట్ ను చూపించడం కష్టం. అందువల్లనే చాలామంది ఈ ఇతిహాసాన్ని ధారావాహికగా అందిస్తూవెళ్లారు. మహాభారతాన్ని భారీస్థాయిలో చెప్పవలసి ఉంటుంది. అందుకు వందలమంది ఆర్టిస్టులు .. భారీ సెట్లు .. కాస్ట్యూమ్స్ .. ఆయుధాలు .. ఏనుగులు .. గుర్రాలు .. రథాలు అవసరమవుతాయి. అందువలన ఇంతవరకూ నార్త్ వారే ఆ సాహసాన్ని చేస్తూ వెళ్లారు.

నిజానికి ఈ తరహా కథలను తెలుగువారు తీసినట్టుగా మరొకరికి సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. మన పాత పౌరాణిక సినిమాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి. దాసరి నారాయణరావు తన డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాభారతం’ కథను ఎపిసోడ్స్ గా తెరకెక్కిచడమే అని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ‘బాహుబలి’ చూసిన తరువాత, చారిత్రకాలు .. పౌరాణికాలు రాజమౌళి గొప్పగా హ్యాండిల్ చేయగలరు అనే ఒక నమ్మకం ఆడియన్స్ లో ఏర్పడింది. అందుకు ఇంకా సమయం ఉందని కూడా రాజమౌళి చెప్పారు.

అయితే ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 AD’ చూసినవారు, నాగ్ అశ్విన్ కూడా ‘మహాభారతం’ వంటి కథలను డీల్ చేయగలడు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, మహాభారతాన్ని రాజమౌళి మాత్రమే గొప్పగా తీయగలరని అన్నాడు. అంటే తనకి అలాంటి ఆలోచన లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు. కనుక భవిష్యత్తులో రాజమౌళి నుంచి మాత్రమే ‘మహాభారతం’ ఉంటుందని ఆశించవచ్చు. మహేశ్ బాబుతో సినిమా తరువాత, ఈ ప్రాజెక్టు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్