Sunday, January 19, 2025
Homeసినిమాచైతూ - చందూ మూవీ సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణం..?

చైతూ – చందూ మూవీ సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణం..?

అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కలిసి ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు చేశారు. ఇందులో ప్రేమమ్ సక్సెస్ సాధించగా, సవ్యసాచి ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇది శ్రీకాకుళంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతుంది. ఆమధ్య శ్రీకాకుళం వెళ్లి మరీ.. అక్కడ జరిగిన సంఘటనలు గురించి తెలుసుకున్నారు. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి కానీ.. ఇంత వరకు స్టార్ట్ కాలేదు.

దీంతో ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇందులో నాగచైతన్య క్లైమాక్స్ లో పొడవాటి హెయిర్ తో.. గుబురు గెడ్డంతో కనిపిస్తారట. అందుకనే హెయిర్ అండ్ గెడ్డం పెరిగే వరకు వెయిట్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల అక్కినేని శత జయంతి వేడుకలో పాల్గొన్న చైతన్య పొడవాటి హెయిర్, గుబురు గెడ్డంతో కనిపించారు. ఇప్పుడు అనుకున్నట్టుగా హెయిర్ పెరగడంతో నవంబర్ నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. ఇందులో చైతన్యకు జంటగా సాయిపల్లవి నటిస్తుంది.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీలో నటించారు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ కలిసి సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలాంటి బ్రేకేలు లేకుండా షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. చైతన్య మార్కెట్ కు మించిన బడ్జెట్ తో సినిమాను చేస్తున్నారు. మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయనుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్