Thursday, June 18, 2026
HomeసినిమాNaga Chaitanya: చైతు, శివ నిర్వాణ కాంబో సెట్ అయ్యిందా..?

Naga Chaitanya: చైతు, శివ నిర్వాణ కాంబో సెట్ అయ్యిందా..?

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ లో రూపొందిన చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇందులో నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి నటించింది. అరవింద్ స్వామి విలన్ గా నటించగా ప్రియమణి కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయడం.. ఈ టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది.

అయితే.. కస్టడీ తర్వాత నాగచైతన్య ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు. ఈ మూవీ రిలీజ్ తర్వాత నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేయనున్నాడని తెలిసింది. తాజా వార్త ఏంటంటే.. మజిలీ చిత్రాన్ని తెరకెక్కించి విజయం అందించిన శివ నిర్వాణతో చైతన్య మరో సినిమా చేయనున్నారని సమాచారం. మజిలీ సక్సెస్ తర్వాత చైతన్య, సమంత కాంబోలో మరో సినిమా చేయాలి అనుకున్నారట కానీ.. వాళ్లిద్దరూ విడిపోవడం వలన కుదరలేదు. వీరిద్దరి కోసం అనుకున్న కథనే ‘ఖుషి’ అని.. చైతన్య ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చాడని ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఓ ఫ్యామిలీ డ్రామను డైరెక్టర్ శివ నిర్వాణ నాగ చైతన్యకి వినిపించగా ఆయనకు కథ బాగా నచ్చిందట. వెంటనే తాను ఆ సినిమా చేయడానికి ఒకే చెప్పారట. ఈ డైరెక్టర్ తో చైతూ చేసిన మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమాలో చైతూని ఆయన చూపించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. మళ్లీ చైతూ, శివ నిర్వాణ కాంబో అంటే అంచనాలు భారీగా ఉంటాయి. మరి.. ఈసారి కూడా వీరిద్దరూ కలిసి మరో బ్లాక్ బస్టర్ మూవీ అందిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular