21.3 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeసినిమాNaga Chaitanya Motor Racing: మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ ఓనర్ షిప్ దక్కించుకున్న నాగ చైతన్య

Naga Chaitanya Motor Racing: మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ ఓనర్ షిప్ దక్కించుకున్న నాగ చైతన్య

నాగ చైతన్య ఇటీవల ప్రముఖ మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (HBB) ఓనర్ షిప్ ని పొందారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తనదైన ముద్ర వేసిన ఈ జట్టు ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ సీజన్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ ఎక్సయిటింగ్ కొత్త వెంచర్‌ ని రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RPPL) నిర్వహించి, ప్రమోషన్స్ చేస్తోంది. నాగ చైతన్య, ఫార్ములా 1, సూపర్‌కార్‌లు, మోటార్‌సైకిళ్ల ను అమితంగా ఇష్టపడతారు. ఆయనకు మోటార్‌స్పోర్ట్స్ పై చాలా ప్యాషన్ వుంది. స్పోర్ట్స్ పట్ల అతని ఆసక్తి, ఉత్సాహం, ఇండియన్ మోటార్‌స్పోర్ట్ డొమైన్ యొక్క సమగ్ర వృద్ధికి దోహదపడే గొప్ప ఉద్దేశంతో రేసింగ్ టీం లో ఇన్వెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. “మోటార్‌స్పోర్ట్ లో భాగం కావాలని ఎప్పుడునుంచో చూస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌లో భాగమైనందుకు చాలా అనందంగా వుంది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఇండియన్ మోటార్‌స్పోర్ట్‌లో ఔత్సాహికులందరికీ గొప్ప వినోదాన్ని అందిస్తుంది. అలాగే యువ ప్రతిభావంతులకు వేదికగా నిలిచింది. ఈ సీజన్‌లో స్ట్రీట్ రేసుల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది వీక్షకులకు గొప్ప అనుభవంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అన్ని వయసుల వారికి మోటార్‌స్పోర్ట్ పట్ల అవగాహన పెరుగుతుండటంతో, దానిలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం. ఇది జరిగేలా చేసిన చేసిన మిస్టర్ అఖిల్‌కి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.

ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తొలి సంవత్సరంలో, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ అందరి ప్రశంసలు అందుకుంది. జట్టులోని ఇద్దరు ప్రముఖ డ్రైవర్లు, అఖిల్ రవీంద్ర , నీల్ జానీ, డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రశంసనీయమైన 1-2 ఫినిష్ ని సాధించారు. యూనిట్‌గా, HBB టీమ్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండవ స్థానాన్ని పొందింది. వారి ఆశయాలను పెంచుకుంటూ, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఈ సంవత్సరం FIA-సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ ప్రపంచ వ్యాప్తంగా వర్ధమాన, ఔత్సాహిక రేసర్‌లను ఆకర్షించడానికి ఎదురుచూస్తోంది అన్నారు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్