Sunday, January 19, 2025
Homeసినిమాఫ్యామిలీ ఫీల్ వచ్చింది : నాగచైతన్య

ఫ్యామిలీ ఫీల్ వచ్చింది : నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సక్సస్ మీట్ లో హీరో నాగ చైతన్య మాట్లాడారు. “లవ్ స్టోరీ సక్సస్ సాధించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ లవ్ స్టోరి మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తుంది. పాండమిక్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఫ్రైడే మూవీస్ థియేటర్లలో ఎలా ఉన్నాయి, వాటి రిజల్ట్ ఏంటి అనేది ఎప్పుడూ గమనిస్తుంటాను. పాండమిక్ వల్ల అది మిస్ అయ్యాను కానీ.. ఈ నెల 24న ఆ మ్యాజిక్ డే నాకు వచ్చింది. రిలీజ్ చేస్తే.. థియేటర్ కు జనాలు వస్తారా లేదా అని భయపడ్డాం కానీ మీరు వచ్చి చూస్తున్నారు. చాలా థాంక్స్. తెలుగు సినిమా ఆడియెన్స్ చిత్రాలను ఆదరించినట్లు దేశంలో ఇంకెక్కడా ఆదరించలేదు.

దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ ‘లవ్ స్టోరి’ సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఆగొద్దు, ఇక పైనా మంచి సినిమాలు చేద్దాం. సినిమా రిలీజ్ అయ్యే ముందు లవ్ స్టోరి హిట్ కావాలని స్టార్స్, డైరెక్టర్స్ కోరుకున్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ క్రియేట్ చేశారు. వాళ్లందరికీ థాంక్స్. మా నిర్మాతలు కంటెంట్ నమ్మారు. థియేటర్లో రిలీజ్ అవ్వాలని హోల్డ్ చేశారు. లవ్ స్టోరితో శేఖర్ గారు చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈ మ్యాజికల్ సక్సెస్ సందర్భంగా లవ్ స్టోరి టీమ్ అందరికీ కంగ్రాట్స్. మా అభిమానులందరికీ థాంక్స్. కొత్త సినిమా అయినా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కొత్త తరహా సినిమా చేస్తే మీ ఆదరణ ఉంటుందని నిరూపించారు. లవ్ స్టోరిని థియేటర్లో ఎంజాయ్ చేయండి” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్