Friday, April 19, 2024
HomeTrending Newsడబుల్ బెడ్ రూమ్ ఎప్పటిలోగా ఇస్తారు? బండి

డబుల్ బెడ్ రూమ్ ఎప్పటిలోగా ఇస్తారు? బండి

రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇళ్ళ కోసం మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంతమందికి అర్హత ఉందనే వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ కు బండి సంజయ్ లేఖ రాశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

⦿ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు  నిర్మించారు? ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి?
⦿ అఖిలపక్ష నేతలను తీసుకెళ్లి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చూపించే దమ్మూ ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా?
⦿ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఈ 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత? ఖర్చు చేసిందెంత?
⦿ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులెన్ని? వీటి వివరాలను అందించగలరా?
⦿ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు?
⦿ మిగతా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు?
⦿ మీరు 2014లో నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారమే 26.31 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు రాష్ట్రంలో ఉన్నారు.
⦿ 7 ఏళ్లు పూర్తవుతున్నా వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోతున్నారు? పేదల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా?

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల 91 వేల ఇళ్ళను మంజూరు చేస్తే, అందులో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని నిలదీశారు.  ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తిచేస్తే మరో 10 లక్షల కేంద్రం నుండి మంజూరు చేయించే బాధ్యత బిజెపి తెలంగాణ శాఖ తీసుకుంటుందని బండి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్