Wednesday, June 17, 2026
HomeసినిమాNaga Chaitanya: చైతూ తెలివిగా ఫ్లాప్ తప్పించుకున్నాడా?

Naga Chaitanya: చైతూ తెలివిగా ఫ్లాప్ తప్పించుకున్నాడా?

ఇండస్ట్రీలో ఒకరి కోసం కథ అనుకంటే.. మరొకరితో సెట్ అవుతుంటుంది. ఇలా జరగడం కామన్. అయితే.. ఒక హీరో మిస్ చేసుకున్న సినిమా మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక హీరో నో చెప్పిన కథను మరో హీరో చేస్తే ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటిదే నాగచైతన్య విషయంలో జరిగిందని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే… నాగచైతన్య కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథను విన్న వెంటనే ఈ సినిమా చేయాలా..? వద్దా..? అనే నిర్ణయం తీసుకోకుండా ఆ కథ గురించి బాగా ఆలోచించి రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటాడు.

ఇదిలా ఉంటే… ఆమధ్య నాగచైతన్యతో నందినీ రెడ్డి సినిమా అంటూ వార్తలు వచ్చాయి కానీ.. చైతన్య మాత్రం అలాంటిది ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. మేటర్ ఏంటంటే.. నందినీ రెడ్డి, నాగచైతన్యతో సినిమా చేయాలనుకుందట. కథ చెప్పడం కూడా జరిగిందట కానీ… ఎందుకనో నో చెప్పాడట.. ఆ కథతో వచ్చిన సినిమానే అన్నీ మంచి శకునములే. ఇందులో సంతోష్ శోభన్ నటించారు. స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ తారాగణంతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందింది. అయితే… ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఈ సినిమా రిజెక్ట్ చేసి నాగ చైతన్య మంచి పనే చేశాడులే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫరవాలేదు అనే టాక్ వచ్చింది. దీంతో చైతు చేసుంటే హిట్ అయ్యేదేమో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైతేనే చైతన్య తెలివిగా ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య తదుపరి చిత్రం గురించి కథా చర్చలు జరుగుతున్నాయి. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది త్వరలో ప్రకటించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular