Saturday, January 18, 2025
Homeసినిమావిభిన్నంగా నాగ చైతన్య సినిమా ప్రమోషన్స్

విభిన్నంగా నాగ చైతన్య సినిమా ప్రమోషన్స్

Innovative: యువ సామ్రాట్ నాగ చైతన్య, అందాల తార రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ‘. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 22న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటలను విడుదల చేసి ప్రమోషన్ ప్రారంభించారు. పాటలకు మంచి స్పందన లభించింది.సినిమా టైటిల్ లో చెప్పినట్లుగా “మన జీవితాన్ని సులభతరం చేసి.. కష్ట సమయాల్లో  సహాయం చేసి.. విజయానికి బాటలు వేసిన వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి” అంటూ నాగ చైతన్య ఆ పని చేశాడు. ముందుగా తన తల్లి  లక్ష్మికి ఇన్ స్టాగ్రామ్ లో హృదయపూర్వక కృతజ్ఞతా పత్రాన్ని పోస్ట్ చేసాడు. అలాగే తనను సరైన మార్గంలో నడిపించినందుకు, ఒక స్నేహితుడిగా ఉన్నందుకు తన తండ్రి అక్కినేని నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికి ఎవరు ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారో పంచుకోవడానికి #themagicwordisthankyou అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించాలి అని చెప్పాడు.

ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. నాగ చైతన్య నుండి వచ్చిన ఈ లవ్లీ నోట్ మరెన్నో కృతజ్ఞతతో కూడిన కథలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా తెస్తుందనడంలో సందేహం లేదు. అయితే.. చైత‌న్య త‌న మ‌న‌సులో మాట‌ల‌ను చెప్పి ట‌చ్ చేశాడు అంటున్నారు నెటిజ‌న్లు.

Also Read ‘థ్యాంక్యూ’ నుంచి ఫేర్ వెల్ సాంగ్ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్