Thursday, May 9, 2024
Homeసినిమాప్రతి పండుగకు ఒక మూవీ విడుదల

ప్రతి పండుగకు ఒక మూవీ విడుదల

In front Festival: మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘ఆచార్య’ అంచ‌నాల‌ను అందుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. దీంతో త‌దుప‌రి చిత్రాలపై చిరంజీవి మ‌రింత కేర్ తీసుకుంటున్నారు. క‌థ అంతా స‌రిగా ఉందో లేదో మ‌రోసారి చూసుకోమ‌ని డైరెక్ట‌ర్స్ కి చెప్పారు చిరు. ఈసారి బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అనే ఫుల్  కాన్ఫిడెన్సుతో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే.. చిరు చేస్తున్న సినిమాల రిలీజ్ విష‌యంలో గ్యాప్ ఉంటూనే ప్ర‌తి పండ‌గ‌కి ఓ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయ‌డం అదిరింది అంటున్నారు సినీ జ‌నాలు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి రీమేక్ గా వ‌స్తున్న చిత్రం గాడ్ ఫాద‌ర్. ఈ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్, పూరి జ‌గ‌న్నాథ్ గెస్ట్ రోల్స్ చేస్తుండ‌డం విశేషం. న‌య‌న‌తార, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన గాడ్ ఫాద‌ర్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

ఇక టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 154వ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న‌ శృతి హాసన్ న‌టిస్తుంది. ఈ మూవీ రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఇక మెహర్ రమేష్ తో మెగాస్టార్ చేస్తున్న మూవీ భోళా శంకర్. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలిగా కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశార‌ట‌. ఇలా.. దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు సినిమాలు రిలీజ్ చేస్తుండ‌డంతో మెగాస్టార్ ప్లాన్ అదిరింది అంటున్నారు.

Also Read ద‌స‌రా బరిలో చిరు, బాలయ్య?

RELATED ARTICLES

Most Popular

న్యూస్