Monday, May 20, 2024
Homeసినిమాసందీప్ కళ్ళు చూడ‌గానే చిరంజీవి గుర్తుకొచ్చారు : ముర‌ళీమోహ‌న్‌

సందీప్ కళ్ళు చూడ‌గానే చిరంజీవి గుర్తుకొచ్చారు : ముర‌ళీమోహ‌న్‌

Same eyes:  సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ జంట‌గా న‌టించిన‌ చిత్రం `గంధ‌ర్వ‌`. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై యఎస్‌.కె. ఫిలిమ్స్ స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది. సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో అప్స‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సుబాని అబ్దుల్‌ నిర్మించారు. ఈ చిత్రం జులై 8న విడుద‌ల కాబోతుంది. ఈ  సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో గంధ‌ర్వ ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా చిత్రంలోని మొద‌టి పాట‌ను సిల్లీమోంక్స్ అధినేత సంజయ్‌, న‌టుడు బాబూమోహ‌న్ ఆవిష్క‌రించ‌గా, రెండో పాట‌ను ద‌ర్జా నిర్మాత శివశంక‌ర్‌, ద‌ర్శ‌కుడు చంద్ర‌మ‌హేష్ ఆవిష్క‌రించారు.  అనంత‌రం ఈ చిత్రాన్ని ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్‌లో చూసేందుకు మొద‌టి టికెట్‌ను చిన్నారులు శాన్వీ, ఆద్య‌, హ‌ర్షితలు ల‌క్ష రూపాయ‌ల‌కు కొనుగోలు చేశారు. ఈ టికెట్‌ను ముఖ్య అతిథి ముర‌ళీమోహ‌న్ విడుద‌ల చేశారు.

అనంత‌రం ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా వుంది. గంధ‌ర్వ టైటిల్లోనే  ప‌రిమ‌ళం క‌నిపించింది. యువ‌కులంతా చేసిన సినిమా ఇది. సురేష్ కొండేటి కొన్నాడ‌న‌గానే మ‌రింత సంతోషం వేసింది. ఆయ‌న‌ది గోల్డెన్ హ్యాండ్‌. రిపోర్టర్ గా వ‌చ్చి సంతోషం మ్యాగ‌జైన్ స్థాపించ‌డ‌మే కాకుండా సౌత్‌లోని నాలుగు భాష‌ల్లోనూ సినిమా అవార్డులు ఇస్తున్నారు. అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్ర ప్ర‌భుత్వాలు కూడా చేయ‌ని ప‌ని చేస్తున్నారు. అలాంటి గోల్డెన్ హ్యాండ్ గంధ‌ర్వ తీసుకున్నారు. ఇక సందీప్‌ను చూడ‌గానే నేను చిరంజీవిగారితో `మ‌నఊరి పాండవులు` చేశాను. చిరంజీవి గారు క‌న్నెర చేస్తే ఎలా వుంటుందో సందీప్ క‌ళ్ళ‌ను చూస్తే అలా అనిపించింది. ఆయ‌న‌కు మంచి భ‌విష్య‌త్ వుంది. సీనియ‌ర్ న‌టుడు కె.కె. శ‌ర్మ గారి మ‌న‌వుడు అని తెలిశాక మ‌రింత ఆనందమేసింది. ఇక సినిమాలో పాట‌లు ష‌కీల్ బాగా చేశారు. అప్స‌ర్ ద‌ర్శ‌క‌త్వం చాలా బాగుంది. మంచి సినిమా తీశారు. ముందుముందు మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. సాయికుమార్ నేను క‌లిసి ‘దేవుడు చేసిన పెళ్లి’ సినిమాతో కెరీర్ ప్రారంభించాం. సురేష్ కూడా న‌టించాడు. అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.

Also Read అదే మాకు ప్లస్ పాయింట్: సందీప్ మాధవ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్