Thursday, March 19, 2026
Homeసినిమారేపటి నుండి నాగ చైతన్య సినిమా షూటింగ్

రేపటి నుండి నాగ చైతన్య సినిమా షూటింగ్

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి NC22 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. నాగచైతన్యకు ఇది తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. అలాగే వెంకట్‌ ప్రభుకి కూడా ఇది తొలి తెలుగు సినిమా. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమంతో ప్రారంభమైయింది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

రేపు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో NC22 చిత్రీకరణ ప్రారంభం కానుంది. “అక్కినేని నాగేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో.. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అద్భుతమైన అప్‌డేట్‌ను ప్రకటిస్తున్నాం. రేపటి నుండి #NC22 యాక్షన్ బిగిన్స్” అని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా నాగ చైతన్య సంబధించిన ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇది అందరినీ సర్ ప్రైజ్ చేయడంతో పాటు ఆసక్తిని పెంచింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు.

Also Read: నాగార్జున 100వ సినిమా ద‌ర్శ‌కుడెవరు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular