కిరణ్ అబ్బవరం తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని‘ సినిమా రూపొందింది. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లేను .. సంభాషణలను కిరణ్ అబ్బవరమే సమకూర్చడం విశేషం. చూస్తుంటే ఈ సారి ఆయన డాన్సుల పై పూర్తిగా ఫోకస్ చేసినట్టుగానే కనిపిస్తోంది. అలాగే తన వైవు నుంచి మాస్ ఆడియన్స్ ను .. ఎస్వీ కృష్ణారెడ్డి  పాత్ర వైపు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది.

ఈ నెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ స్టేజ్ పై కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. “కోడి రామకృష్ణ గారి సినిమాలను చూస్తూ పెరిగినవాడిని. అలాంటి ఆయన బ్యానర్లో సినిమా చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి ఒక అవకాశం రావడం నిజంగా నా అదృష్టమే. ఈ సినిమాలో నేను ఒక వైపున క్లాస్ .. మరో వైపున మాస్ అన్నట్టుగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాను. ఇలాంటి ఒక సినిమాను నేను చేయడం ఇదే ఫస్టు టైమ్. సెకండాఫ్ లో నేను .. బాబా మాస్టర్ చేసే కామెడీ మీ అందరికీ బాగా నచ్చుతుంది.

ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్ధార్థ్ మీనన్ ఒక స్పెషల్ రోల్ చేశాడు. ఆయన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది .. మీ అందరికీ నచ్చుతుంది. మణిశర్మగారి పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని నేను గట్టిగా చెప్పగలను. నాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదో నాకు తెలియదుగానీ, అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. నా నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని నమ్మకంగా చెబుతున్నాను. ఈ నెల 16న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. థియేటర్ కి వెళ్లి చూడండి .. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి” అంటూ ముగించాడు.

Also Read: ఎదుగుతూ ఉండటమే కిరణ్ అబ్బవరం చేసిన తప్పా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *