కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకుడు శ్రీధర్ గాదె ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని‘ సినిమాను రూపొందించాడు. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమా ద్వారా ఇద్దరు కథానాయికలు పరిచయమవు తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఈ నెల 16వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. బెల్లంకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం నడిచింది. ఈ వేదికపై దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ ..  సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరంను కొంతమంది టార్గెట్ చేయడం పట్ల ఆయన ఆవేదనను .. అసహనాన్ని వ్యక్తం చేశాడు.

“కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న దగ్గర నుంచి నాకు తెలుసు. అలాంటి ప్రయత్నాల్లోనే ఆయన నన్ను కలవడం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరం కలిసే మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. తనకి సినిమా అంటే ప్యాషన్ .. అందుకోసం ఆయన ఎంత కష్టమైనా పడతాడు. ఆయన పక్కనే ఉంటూ  చూడటం వలన ఆ విషయం నాకు తెలుసు. కానీ ఈ సంగతి తెలియని కొంతమంది  ఆయనను ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఏజ్ గ్రూప్ వారే ఈ పని చేస్తున్నారని నేను అనుకుంటు న్నాను. అలాంటి వాళ్లంతా ఒకసారి ఆలోచన చేయండి.

కిరణ్ చేతిలో పది సినిమాలవరకూ ఉన్నాయి. తను వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ .. ప్రోత్సహిస్తూ వెళుతున్నాడు. ఆయన ఇలా  వరుసగా సినిమాలు చేర్యాడం  వలన  కొంతమందికి ఉపాధి దొరుకుతోంది. తాను కష్టపడి ఎదుగుతూ .. తనచుట్టూ ఉన్నవారు కూడా ఎదగాలని కోరుకోవడమే ఆయన చేసిన తప్పా? ఎదుటువారిని కామెంట్స్ చేస్తూ మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానిని చేరుకోవడానికి ప్రయత్నించండి” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *