Thursday, March 28, 2024
HomeTrending News‘నిరుద్యోగం’పై చర్చకు టిడిపి పట్టు

‘నిరుద్యోగం’పై చర్చకు టిడిపి పట్టు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం తొలుత  ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే టిడిపి సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడి నిరుద్యోగ అంశంపై చర్చ చేపట్టాలని, దీనిపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని డిమాండ్ చేశారు. వారి విజ్ఞప్తిని తిరస్కరిస్తూ తొలుత ప్రశ్నోత్తరాల్లో పాల్గొనాలని, ఆ తర్వాత వాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తానని స్పీకర్ చెప్పారు. అయినా టిడిపి సభ్యులు శాంతించలేదు, స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. అధికార పక్షం తరఫున మంత్రులు బుగ్గన, జోగి రమేష్,  దాడిశెట్టి రాజా… ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ బాబు తదితరులు టిడిపి సభ్యులపై ప్రతి విమర్శలు చేశారు. ఈ దశలో స్పీకర్ పది నిమిషాలు సభను వాయిదా వేశారు.

అనంతరం సభ సమావేశమైన తర్వాత కూడా టిడిపి సభ్యులు నిరుద్యోగ అంశంపై చర్చకు పట్టుబట్టారు. ఇటీవల మృతి చెందిన శాసన సభ మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. దివంగతులైన మాజీ ఎమ్మెల్యేలకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం మరోసారి సభను స్పీకర్ వాయిదా వేశారు.

Also Read: టిడిపి నేతలకు బుద్ధి లేదా: బొత్స

RELATED ARTICLES

Most Popular

న్యూస్