Thursday, March 28, 2024
HomeTrending Newsటిడిపి నేతలకు బుద్ధి లేదా: బొత్స

టిడిపి నేతలకు బుద్ధి లేదా: బొత్స

సీపీఎస్ విషయంలో ఉద్యోగుల ఆవేదనను అర్ధం చేసుకున్నామని,  అందుకే జీపీఎస్ విధానాన్ని ప్రతిపాదించామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే జీపీఎస్ లో మరిన్ని ప్రయోజనాలు చేర్చామని తెలిపారు. ఉద్యోగుల కమిటీతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. జీపీఎస్ విషయం ఫైనల్ అయిన తరువాత దానికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చామన్నారు.

జీపీఎస్ పై ఉద్యోగులతో కూలంకషంగా చర్చలు జరుపుతున్నామని, ఫైనల్ డ్రాఫ్ట్ ను వారికి వివరించామని, రిటైర్ అయిన తరువాత వారికి కనీసం పదివేల రూపాయలు పెన్షన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పెన్షనర్ చనిపోతే ఎక్స్ గ్రేషియా ఇస్తామని, వారి భార్య లేదా భర్తకు పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు. ఆందోళన సందర్భంగా ఉద్యోగ నేతలపై పెట్టిన తీవ్రమైన కేసులను ఉపసంహరించే విషయమై సిఎం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. రేపు కూడా ఉద్యోగులతో చర్చలుంటాయని తెలిపారు.

చంద్రబాబు తన భార్యను ఎవరో ఏదో అన్నారని… ఏం మాట్లాడారో, ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందేనని, టిడిపి నేతలు సిఎం జగన్ తో పాటు తమ పార్టీ నేతల కుటుంబ సభ్యులపై ఏవిధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో బాబుకు తెలియదా అని బొత్స ప్రశ్నించారు. ఇలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలని వ్యాఖ్యానించారు.

Also Read : ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు: సిఎం జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్