Saturday, July 27, 2024
Homeసినిమాచైత‌న్య వెబ్ సిరీస్ టైటిల్ ‘దూత‌’?

చైత‌న్య వెబ్ సిరీస్ టైటిల్ ‘దూత‌’?

Dootha: అక్కినేని నాగ‌చైత‌న్య ‘బంగార్రాజు’ సినిమాతో మ‌రో సక్సెస్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ‘మ‌నం’ ఫేమ్ విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లో ‘థ్యాంక్యూ’ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. స‌మ్మ‌ర్ లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే… నాగ‌చైత‌న్య ఓ వెబ్ సిరీస్ లో న‌టించ‌నున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వెబ్ సిరీస్ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లో షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి కూడా విక్ర‌మ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మూడు సీజ‌న్స్ ఉండే ఈ వెబ్ సిరీస్ కి ‘దూత’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇందులో నాగ‌చైత‌న్య పాజిటివ్ క్యారెక్ట‌ర్ తో పాటు నెగిటివ్ క్యారెక్ట‌ర్ కూడా చేస్తుండ‌డం విశేషం. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ ను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్