Thursday, June 11, 2026
Homeసినిమామరోసారి ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన నాగశౌర్య!

మరోసారి ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన నాగశౌర్య!

ఒకప్పుడు హీరోలు వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. అందువలన ఒక సినిమా కాకపోతే మరొకటి థియేటర్ల దగ్గర నిలబడేది. ఒక సినిమా హిట్ అయితే పది ప్రాజెక్టులు చేతిలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కంటెంట్ లో విషయం లేకపోతే, ఆడియన్స్ థియేటర్ కి రావడం లేదు, అందువలన ఎప్పటికప్పుడు కొత్తగా ఏదైనా చేయాలనే తపన హీరోల్లో కనిపిస్తోంది. దాంతో వాళ్లు ఎక్కువ ప్రాజెక్టులను గురించిన ఆలోచన చేసే అవకాశం లేదు. స్టార్ హీరోలకు సైతం ఈ పరిస్థితి తప్పడం లేదు.

అఖిల్ .. నిఖిల్ .. శర్వానంద్ .. కార్తికేయ .. ఇలా హీరోలంతా కొత్తదనం కోసం ట్రై చేస్తున్నారు. అవసరమైతే కొంత గ్యాప్ తీసుకుని మరీ డిఫరెంట్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాంటి హీరోల జాబితాలో తాజాగా నాగశౌర్య పేరు కనిపిస్తోంది. నాగశౌర్య నుంచి ‘రంగబలి’ వచ్చి ఏడాది కావొస్తోంది. అయినా ఆయన నుంచి ఇంతవరకూ మరో సినిమా లేదు. సరైన సబ్జెక్ట్ ను ఎంచుకోవడానికి ఆయన కొంత సమయం తీసుకున్నాడు. పవన్ బాసం శెట్టితో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.

‘రంగబలి’ సినిమాకి దర్శకుడు పవన్ బాసం శెట్టినే. ఆ సినిమాలో ఆయన నాగశౌర్యను చాలా హ్యాండ్సమ్ గా చూపించాడు. ఆ సినిమా కథాకథనాలు కూడా ఆకట్టుకుంటాయి. తీసిపారేయదగిన కంటెంట్ అయితే కాదు. కానీ రిలీజ్ సమయం తేడా కొట్టేసి ఉండొచ్చు. ఆ సినిమా దర్శకుడి టాలెంట్ నచ్చడం వల్లనే, మళ్లీ ఇప్పుడు నాగశౌర్య  ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular