Friday, March 20, 2026
Homeసినిమానాగ శౌర్య కొత్త సినిమా అనౌన్స్ మెంట్

నాగ శౌర్య కొత్త సినిమా అనౌన్స్ మెంట్

నాగ శౌర్య ఇటీవల తన తదుపరి సినిమాలు ఒకదానికొకటి భిన్నంగా, కమర్షియల్ గా విజయాలు అందుకునే చిత్రాలుగా ఉంటాయని ప్రకటించారు. ఈరోజు ఆయన 24వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. #NS24 చిత్రానికి ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వం వహించనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా నాగశౌర్యకు పర్ఫెక్ట్ యాప్ట్ స్క్రిప్ట్. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

దర్శకుడు ఎస్‌ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Also Read : స్టేజ్ పై ఏడ్చేసిన నందూ .. ధైర్యం చెప్పిన నాగశౌర్య!  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular