Monday, June 8, 2026
Homeసినిమానాగశౌర్య 'లక్ష్య' షూటింగ్‌ పూర్తి

నాగశౌర్య ‘లక్ష్య’ షూటింగ్‌ పూర్తి

ప్రామిసింగ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ల్యాండ్‌ మార్క్ 20వ చిత్రం ‘లక్ష్య’ షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా విడుదలైన వర్కింగ్‌ స్టిల్‌లో దర్శకుడు ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్నారు. కేతిక శర్మతో పాటు మానిటర్‌ చూస్తూ సీన్‌ గురించి వింటున్నారు నాగశౌర్య. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో తెరకెక్కుతున్నసినిమా లక్ష్య. ఎగ్జయిటింగ్‌ ఎలిమెంట్స్ తో  రూపొందించారు దర్శకుడు.

ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు నాగశౌర్య. రెండింటి మధ్య వైవిధ్యం చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకం. డైరక్టర్‌ సంతోష్‌ జాగర్లపూడి సరికొత్త కథను వినిపించడంతోనే  నాగశౌర్య ఈ కథకు కావల్సిన రీతిలో శిక్షణ తీసుకున్నారు. ఇదే ప్రేరణతో షూటింగ్‌ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు సినిమా యూనిట్  పోస్ట్ ప్రొడక్షన్‌ పై దృష్టి సారిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను సోనాలి నారంగ్‌ సమర్పిస్తున్నారు. నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూరు రామ్మోహన్‌, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్ల మీద తెరకెక్కుతోంది. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించారు. వెర్సటైల్‌ యాక్టర్‌ జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ని మేకర్స్ ప్రకటిస్తారు. ఆ వెంటనే సినిమా ప్రమోషన్ కూడా వేగం పెంచనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular