New Districts-Nagari: నగరి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మండల, మున్సిపల్ సమావేశాల్లో తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. నగరిలో ఉన్న తాతయ్య గుంట, గంగమ్మ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగరి తిరుపతి కి అతి సమీపంలో ఉంటుందని, అందులోనూ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) పరిధిలో ఉందని, తుడా ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుతున్నాయని. ఇప్పుడు చిత్తూరులో కలపడం వల్ల ఈ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
రేపు అమరావతికి వెళుతున్నానని,సిఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయమై వివరిస్తానని రోజా చెప్పారు. నగరికి చిత్తూరు ఎంతో దూరం ఉందని, తిరుపతికి బదులు చిత్తూరు జిల్లలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలు భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలను ఇప్పటికే జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లకు ఈ విషయాన్ని విన్నవించామని, రేపు సిఎం దృష్టికి కూడా తీసుకు వెళతానని చెప్పారు.
Also Read : అవసరమైతే సిఎంను కలుస్తా