Friday, March 29, 2024
Homeసినిమానాగార్జున 100వ చిత్రం ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

నాగార్జున 100వ చిత్రం ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్. ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ టీజ‌ర్ ఇటీవలే రిలీజ్ చేశారు. దీనికి  ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.  అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇదిలా ఉంటే.. నాగార్జున 100వ చిత్రం గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా గురించి అప్ డేట్ ఇస్తారా..? అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఇటీవ‌ల నాగ్ 100వ చిత్రం ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్ లో రాబోతుంద‌ని.. ఇటీవ‌ల క‌థాచ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. నాగార్జున‌, రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రాబోతున్న 10వ చిత్రం నాగార్జున 100వ చిత్రం అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఇది నిజ‌మే అనుకున్నారు. ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. నాగార్జున 100వ చిత్రాన్ని రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్ లో కాద‌ట‌. గాడ్ ఫాద‌ర్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో చేస్తున్నార‌ట‌.

ఇందులో అఖిల్ గెస్ట్ రోల్ చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. గాడ్ ఫాద‌ర్ మూవీ రిలీజ్ త‌ర్వాత ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేస్తార‌ని తెలిసింది. భారీ యాక్ష‌న్ మూవీగా రూపొందే ఈ సినిమా చాలా కొత్త‌గా ఉంటుందట‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని టాక్. త్వ‌ర‌లోనే ఈచిత్రాన్ని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్