Saturday, January 18, 2025
Homeసినిమా'బిగ్ బాస్ 7' క్లారిటీ ఇచ్చేసిన నాగ్

‘బిగ్ బాస్ 7’ క్లారిటీ ఇచ్చేసిన నాగ్

బుల్లితెర పై సంచలనం ‘బిగ్ బాస్’ రియాల్టీ షో. ఏ భాషలో సక్సెస్ కానంతగా తెలుగులో బిగ్ బాస్ సక్సెస్ అయ్యింది. ఇప్పటి వరకు 6 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. అందులో ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఆతర్వాత సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు. అయితే.. ఆరవ సీజన్ అనుకున్నంతగా సక్సెస్ కాలేదనే టాక్ వచ్చింది. అందుకనే.. ‘బిగ్ బాస్ 7’ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున కాకుండా వేరే స్టార్ చేయనున్నారని టాక్ వచ్చింది.

ప్రధానంగా దగ్గుబాటి రానా పేరు వినిపించింది. అలాగే వెంకటేష్, బాలకృష్ణ పేర్లు కూడా వినిపించాయి. అన్ స్టాపబుల్ అనే టాక్ షోకు బాలయ్య హోస్ట్ గా చేయడం.. అది సూపర్ సక్సెస్ అవ్వడం తెలిసిందే. అన్ స్టాపబుల్ టాక్ షో తర్వాత బాలయ్యకు మరింత క్రేజ్ పెరిగింది. అందుచేత ఈసారి బిగ్ బాస్ సీజన్ 7కు బాలయ్యను హోస్ట్ గా పెడితే మరింత క్రేజ్ వస్తుందని స్టార్ మా యాజమాన్యం భావించిందని.. ఈసారి నాగ్ ప్లేస్ లో బాలయ్య రావడం ఖాయమన్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ 7 హోస్ట్ ఎవరు అనేది సస్పెన్స్ గా ఉండేది.

ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెర పడింది. బిగ్ బాస్ సీజన్ 7కు కూడా హోస్ట్ గా నాగార్జునే చేయనున్నారు. స్టార్ మా బిగ్ బాస్ 7 కు సంబంధించి ఓ ప్రొమో రిలీజ్ చేసింది.
కుడి ఎడమైతే… పొరపాటు లేదోయ్ అంటూ నాగ్ చేసిన సందడిని ఈ ప్రోమోలో చూడొచ్చు. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ షో ఎప్పుడూ చూడనంత డిఫరెంట్ గా ఉంటుందన్న టాక్ వచ్చింది. సీజన్ 6 పై వచ్చిన విమర్శలు నేపథ్యంలో కాస్త డిఫరెంట్ గా.. కాస్త ఎక్కువ ఎంటర్ టైనింగ్ గా ఉండేలా ప్లాన్ చేశారట. అలాగే హోస్ లోకి వచ్చే కంటెస్టంట్లును కూడా బాగా ఫేమస్ అయిన వాళ్లనే తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి.. ఈసారి బిగ్ బాస్ 7 ఏం చేస్తుందో.. ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్