Nagarjuna Going To Concentrate On Family Movies :
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఈ జనరేషన్ లో అయన పోషించిన డిఫరెంట్ రోల్స్ మరే ఇతర హీరో పోషించలేదనే చెప్పవచ్చు. అయన నటించిన రొమాంటిక్ మూవీ మన్మథుడు-2 ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ చేశారు. ఈ సినిమా థియేటర్ లో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రంలో అయన నటిస్తున్నారు. ఈ విషయంలో నాగార్జున పునరాలోచనలో పడ్డారని తెలిసింది.
తాను చేసిన రొమాంటిక్, యాక్షన్ మూవీలు వరుసగా విఫలం కావడంతో మళ్ళీ యాక్షన్ వైపే అడుగులు వేసే బదులు ఫ్యామిలీ మూవీ చేస్తే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తగ్గిస్తే మంచిదని ప్రవీణ్ సత్తారుకు నాగార్జున సూచించారట. ఇకపై ఫ్యామిలీ మూవీస్ పైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నారట. అందుకనే ఈ సినిమా కంటే ముందే ‘బంగార్రాజు’ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున సొంతంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది నాగార్జున ప్లాన్. మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ నాగ్ కు కలిసొస్తుందో లేదో చూడాలి.
Must Read : మళ్ళీ నాగార్జునే బిగ్ బాస్