హుజురాబాద్ లో తెరాస కుట్రలు :ఈటెల

ఆర్థిక మంత్రిగా ఉండగా గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ, మిషన్ కాకతీయ బిల్లులు కష్టపడి ఇప్పించేవాడిని, గత మూడేళ్లుగా ఏ బిల్లులు రావడంలేదని బిజెపి నేత ఈటెల రాజేందర్ తెలిపారు. పనులు చేసిన వారు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ హుజూరాబాద్ లో మాత్రం కోట్ల రూపాయలు ఇస్తామని కెసిఆర్ చెప్తున్నారని ఎద్దేవా చేశారు. కమలపూర్ లో ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఈటల రాజేందర్ ఈ రోజు సమావేశం అయ్యారు.

వరంగల్, సిద్దిపేట కి వచ్చిన కెసిఆర్ మాటలు వింటే ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం కెసిఆర్ అనుకొనేటట్టు, మాట ఇస్తే తప్పను అన్నట్టు మాట్లాడుతున్నారనీ ఆయన అసలు రంగు బయటికి తెలియదన్నారు. హుజూరాబాద్ గ్రీన్ వుడ్ స్కూల్ లో పరకాల ఎమ్మెల్యేతో  నీచపు నికృష్టపు పనులు చేయిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. ఈ కుట్రలకు చరమగీతం పాడే నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం. వందలకొట్ల డబ్బులు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికలు గెలవొచ్చుగాక కానీ ఇక్కడ ధర్మమే గెలుస్తుంది. ఇక్కడ డబ్బుకి, నిర్బంధాలకు, దబాయింపులకు ఆస్కారం లేదు.

పరకాల ఎమ్మెల్యే డబ్బులతో గెలిచిండని రాజేందర్ ఆరోపించారు. నా ఆరు సార్ల ఎలక్షన్ లో ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క చుక్క మందు పోయలేదు. 365 రోజులు అందుబాటు లో ఉన్న. ఇప్పుడు హుజూరాబాద్ లో చీకటి అధ్యాయానికి తెర లేపారు. కుల సంఘాలను, నాయకులను తీసుకుపోతున్నారు, సిద్దిపేటలో అడ్డా పెట్టి డబ్బులు ఇస్తున్నారు. తెచ్చుకోండి ఆ డబ్బు  వారి అయ్య సొత్తు కాదు. కానీ ఓటు మాత్రం ధర్మం తప్పకుండా వేయండని బిజెపి నేత కోరారు.

మా ఉరికి వస్తున్న ఎమ్మెల్యే ల్లారా మీ నియోజక వర్గంలో పెంచన్లు, కార్డులు ఇప్పించుకొండి నా దగ్గర ఎం పని అని ఈటెల ప్రశ్నించారు. నా మనిషిని ఇబ్బంది పెడితే మాడి మషి అయిపోతారని హెచ్చరించారు. అధికారులు బానిసలుగా మారి భాధ్యత మర్చిపోతే భవిష్యత్ కటువుగా ఉంటుందన్నారు. 2023 లో తెలంగాణ గడ్డ మీద గెలిచేది బీజేపీ అని రాజేందర్ చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చే సమయం ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *