టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడం.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కథానాయిక కాజల్. ఈ సినిమాలోని నాగార్జున న్యూలుక్ లో చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఈ లుక్ ను ఈరోజు చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాల పై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ట్విట్టర్ లో స్పందిస్తూ… ఈ సినిమాకి సంబంధించిన ఎగ్జైటింగ్ డీటైల్స్ ను నాగార్జున పుట్టినరోజున తెలియచేయనున్నాం అని ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టైటిల్ ఏంటి..? రిలీజ్ ఎప్పుడు..? అనేది నాగార్జున పుట్టినరోజైన ఆగష్టు 29న క్లారిటీ వస్తుందని సమాచారం.