Friday, March 29, 2024
Homeసినిమామహేష్-రాజమౌళి మూవీలో నాగ్?

మహేష్-రాజమౌళి మూవీలో నాగ్?

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఈ చిత్రానికి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ అక్టోబ‌ర్ 5న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్ర‌మోష‌న్స్ ను ఇప్ప‌టి నుంచే స్టార్ట్ చేశారు. ఈ మూవీ ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. ది ఘోస్ట్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన సంద‌ర్భంగా నాగార్జున మ‌హేష్

బాబుకు థ్యాంక్స్ తెలియ‌చేస్తూ.. మ‌నిద్ద‌రం ఎందుకు క‌లిసి న‌టించకూడ‌దు అన‌డం.. దీనికి మ‌హేష్ బాబు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అన‌డం ఆస‌క్తిగా మారింది. ఈ క్రేజీ కాంబినేష‌న్లో మూవీ సెట్ అయితే బాగుంటుంద‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యింద‌ని.. అందుక‌నే నాగార్జున అలా స్పందించార‌ని టాక్ వినిపిస్తోంది.

అవును.. మ‌హేష్ బాబు రాజ‌మౌళితో భారీ పాన్ ఇండియా మూవీ చేయ‌నున్నారు. ఇందులో ఓ కీల‌క పాత్ర ఉంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఆ పాత్ర‌కు నాగార్జున‌ను ఎంపిక చేశార‌ని.. అందుక‌నే నాగ్, మ‌హేష్ ఇలా ట్విట్ట‌ర్ లో మాట్లాడుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీలో నాగార్జున న‌టిస్తే ఆ సినిమాకి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. ఇదే క‌నుక జ‌రిగితే అక్కినేని అభిమానులు, ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల‌కు పండ‌గే.

Also Read : నాగార్జున‌, మ‌హేష్ కాంబోలో భారీ మ‌ల్టీస్టార‌ర్.? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్