Saturday, January 18, 2025
Homeసినిమాఆకట్టుకుంటున్న నాగ్ 'ది ఘోస్ట్' పోస్ట‌ర్

ఆకట్టుకుంటున్న నాగ్ ‘ది ఘోస్ట్’ పోస్ట‌ర్

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘ది ఘోస్ట్‘.  ఇందులో నాగార్జున పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన‌ ఘోస్ట్ కిల్లింగ్ మిషన్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆఫీసర్ లుక్ లో నాగ్ యాక్షన్ మైండ్ బ్లోవింగ్ అనిపించింది. స్పెషల్ యాక్షన్ బ్లాక్ ఫ్యాన్స్ నే కాకుండా కామ‌న్ ఆడియన్స్ ని కూడా ఆక‌ట్టుకుంది.

ఇక టీజర్… ట్రైలర్ తో డబుల్ ట్రీట్ షురూ అవుతుందని అభిమానులు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఘోస్ట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఆకాశంలో  కమ్ముకొస్తున్న మేఘాలు నాగ్ ముఖంలో ఎమోషన్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

కంటనీరు.. చేతిలో తల్వార్ వెనుక ఎంతో ఎమోషన్ కనిపిస్తుంది. ఇంటర్ పోల్ ఆఫీసర్ చేతిలో తల్వార్.. ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ఇంటర్ పోల్ ఆఫీసరే ఘోస్ట్ గా మారతాడా? అన్న అనుమానం కలుగుతోంది.  ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. లేటెస్ట్ పోస్టర్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్టోబ‌ర్ 5న ‘ది ఘోస్ట్’ రిలీజ్ కానుంది. మ‌రి.. బంగార్రాజుతో స‌క్సెస్ లో ఉన్న నాగ్ ది ఘోస్ట్ మూవీతో ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read : ‘ది ఘోస్ట్’ షూటింగ్ పూర్తి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్