Sunday, June 28, 2026
Homeసినిమా'డేటింగ్' సీక్రెట్ బైటపెట్టిన విజ‌య్

‘డేటింగ్’ సీక్రెట్ బైటపెట్టిన విజ‌య్

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘పెళ్లి చూపులు’ తో స‌క్సెస్ సాధించాడు. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. ఈ రెండు సినిమాల‌తో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తే ‘లైగ‌ర్’ తో ఇండియా వైడ్ సంచ‌ల‌నం సృష్టిస్తుండ‌డం విశేషం. ఇప్పటికే విడుదలైనట్రైలర్‌, సాంగ్స్‌ సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేసింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన‌ ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ నెల25న లైగ‌ర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న విజయ్‌ తాజాగా తన రిలేషన్‌షిప్‌ స్టేటస్ పై ఓపెన్‌ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ మాట్లాడుతూ.. పర్సనల్‌ లైఫ్‌ గురించి బయటపెట్టడం ఇష్టం ఉండదు. నటుడిగా పబ్లిక్‌ లైఫ్‌లో ఉండటం నాకు ఇష్టమే కానీ.. పబ్లిక్‌లో ఫోకస్‌ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఈవిధంగా త‌ను డేటింగ్ లో ఉన్నాన‌నే విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. అయితే.. విజ‌య్ ఈవిధంగా స్పందించడంతో విజయ్‌ డేటింగ్‌లో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాద‌నేది తెలిసింది అంటూ నెటిజన్లు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా విజయ్‌ స్టేట్‌మెంట్‌తో రష్మికతో డేటింగ్‌ రూమర్స్‌కి కూడా చెక్‌ పెట్టినట్లయ్యింది. మ‌రి.. విజ‌య్ మ‌న‌సు దోచుకున్న ఆ అమ్మాయి ఎవ‌రో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Also Read : బీహార్ లోనూ లైగర్ కు సూపర్ రెస్పాన్స్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular