Thursday, March 28, 2024
Homeసినిమావిడుద‌ల‌కు సిద్ద‌మైన `న‌ల్ల‌మ‌ల‌`

విడుద‌ల‌కు సిద్ద‌మైన `న‌ల్ల‌మ‌ల‌`

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం `న‌ల్ల‌మ‌ల‌`. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  రవి చరణ్ ‌దర్శ‌కుడు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ ఇప్ప‌టికే 17 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం. అలాగే ఈ చిత్రంనునుండి విడుద‌లైన అన్ని పాట‌లు 1మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించ‌డం ప్రేక్షకుల్లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌ తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు. సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్ లో నిలిచే ఈ మూవీకి సినిమాటోగ్రఫీ: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్, ఎడిటర్: శివ సర్వాణి, ఆర్ట్: యాదగిరి, ఫైట్స్: నబా, విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్, పి.ఆర్.వో: దుద్ది శ్రీను, నిర్మాత: ఆర్.ఎమ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్