Saturday, January 18, 2025
Homeసినిమామరోసారి బాలయ్య- పూరీ కాంబినేషన్!

మరోసారి బాలయ్య- పూరీ కాంబినేషన్!

నందమూరి నటసింహం బాలకృష్ణ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పైసా వసూల్’. ఈ సినిమాలో బాలయ్యను.. అభిమానులు ఎలా చూడానుకున్నారో అలా.. చూపించారు. ఇంకా చెప్పాలంటే.. ఓ అబిమాని తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే.. ఎలా చూపిస్తాడో అలా బాలయ్యను చూపించారు. ఈ సినిమా బాలయ్య అభిమానులకు నచ్చేసింది. ఇక పూరి స్టైల్ మేకింగ్ బాలయ్యకు తెగ నచ్చేసింది. అందుకనే పూరితో బాలయ్య మరో సినిమా చేయాలనుకున్నారు. అందుకనే ‘పైసా వసూల్’ తర్వాత నుంచి వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి డైరెక్షన్ లో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత క్రాక్ మూవీ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో తదుపరి చిత్రాల గురించి బాలయ్య చెప్పారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. అనిల్‌ రావిపూడితో ఓ సినిమా ఉంటుంది. దాని తర్వాత హరికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మాణంలో ఒక చిత్రం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అలాగే పూరి జగన్నాథ్‌తో కలిసి ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌.. విజయ్ దేవరకొండతో లైగర్‌ మూవీ చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య ఓకే చేసిన సినిమాలు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. అయితే.. బాలయ్య నెక్ట్స్ మూవీస్ లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంది. అందుచేత బాలయ్య, పూరి ప్రాజెక్టు ఓకే అయ్యి సెట్స్ పైకి వెళ్లాలంటే కాస్త టైమ్ పడుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్