Friday, March 6, 2026
Homeసినిమాతమ్ముడు మోక్షజ్ఞ కు జూనియర్ వెల్ కమ్

తమ్ముడు మోక్షజ్ఞ కు జూనియర్ వెల్ కమ్

నందమూరి అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. బాక్సాఫీస్ బొనాంజా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తెరంగ్రేటం ఖరారైంది. నేడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఏడాది ప్రధమార్థంలో విడుదలైన హను-మాన్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ప్రశాంత్ వర్మ మొక్షును సినీ పరిశ్రమకు పరిచయం చేయనున్నారు. మహాభారతం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో  బాలయ్య కృష్ణుడి పాత్ర పోషించనున్నారని సమాచారం.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి, బాలయ్య రెండో కుమార్తె ఎం. తేజస్వి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

కాగా, తన తమ్ముడు మోక్షజ్ఞకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘సినిమా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న నీకు అభినందనలు… సరికొత్త ప్రపంచంలోకి రాబోతున్న నీకు తాతగారితో పాటు అభిమానులందరి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. జన్మదిన శుభాకాంక్షలు మోక్షజ్ఞ’ అంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular