Tuesday, June 9, 2026
Homeసినిమాసార‌థి మోష‌న్‌పోస్ట‌ర్ కి విశేష స్పంద‌న‌

సార‌థి మోష‌న్‌పోస్ట‌ర్ కి విశేష స్పంద‌న‌

Saradhi: నందమూరి తారక రత్న న‌టిస్తున్న తాజా చిత్రం ‘సార‌థి’. ఆయ‌న‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినిమా మోష‌న్‌పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన రావడంతో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. ‘సారధి’ మోషన్ పోస్టర్‌కు చాలా ప్రశంసలు వచ్చాయి. మహమ్మారి వ‌ల‌న ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమాను పూర్తి చేసినందుకు పూర్తి స‌హ‌కారాన్ని అందించిన‌ తారక రత్న గారికి ధన్యవాదాలు. టీమ్ మొత్తం సహకారంతో, మేము అనుకున్న విధంగా ఈ సినిమాను పూర్తి చేశాం’’ అని దర్శకుడు జకట రమేష్‌ తెలిపారు.
నిర్మాతలు పి నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావులు మాట్లాడుతూ.. ఖో ఖో గేమ్ బ్యాక్‌డ్రాప్‌గా వచ్చిన ఈ సినిమాలో ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. సిద్ధార్థ్ వాటికన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది అనే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమా విడుద‌ల ఎప్పుడు అనేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular