Tuesday, June 9, 2026
Homeసినిమానాని 'దసరా' భారీ షెడ్యూల్ ప్రారంభం

నాని ‘దసరా’ భారీ షెడ్యూల్ ప్రారంభం

Long Schedule: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా‘ షూటింగ్‌ ను పునః ప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం  పాల్గొంటున్నారు. దీని కోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ వేశారు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్‌ లో నటిస్తున్నారు.  రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌ లో కనిపిస్తూ  తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం. నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దసరా భారీ స్థాయిలో రూపొందుతోంది.

తాజాగా విడుదల చేసిన స్టిల్‌లో నాని లుంగీ, బనియన్‌లలో మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. కోల్ మైన్ పై నిలబడి బీడీ తాగుతున్న లుక్ ఫుల్ మాసీగా వుంది. నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం గత షెడ్యూల్‌లో షూటింగ్ స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు.

అంతకు ముందు నాని, కీర్తి సురేష్‌లపై ఓ పాట చిత్రీకరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట కొరియోగ్రఫీ అందించి యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. నాని మాస్ గెటప్, టెర్రిఫిక్ అవతార్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

Also Read : ‘దసరా’ లో 500 మంది డ్యాన్సర్లతో  భారీ సాంగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular