Sunday, January 19, 2025
Homeసినిమానేను అలాంటి క్యారెక్టర్స్ చేయను : నాని

నేను అలాంటి క్యారెక్టర్స్ చేయను : నాని

No Way: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించ‌నుంది. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ క‌లిసి చేస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సెకండ్ హీరో పాత్ర ఉందని.. ఆ పాత్ర‌ను నానితో చేయించాల‌ని అనుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌హేష్ మూవీలో నాని అనేది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అయితే… నాని న‌టించిన సినిమా అంటే.. సుంద‌రానికి. ఈ చిత్రం జూన్ 10న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చారు నాని.

అంటే.. సుంద‌రానికి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు నాని. అయితే.. మ‌హేష్ మూవీలో న‌టిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది నిజ‌మేనా అని నానిని అడిగితే…అదంతా పుకారేనని నాని కొట్టిపారేశాడు. ఒక్క త్రివిక్రమ్ సినిమానే కాదనీ.. తాను ఏ సినిమాలోను గెస్టు క్యారెక్టర్స్ చేయడం లేదని చెబుతూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మ‌హేష్ మూవీలో నిజంగానే సెకండ్ హీరో క్యార‌క్ట‌ర్ ఉంద‌ట‌. మ‌రి.. ఆ పాత్ర‌ను ఏ యంగ్ హీరోతో చేయిస్తారో చూడాలి.

Also Read :  ఈ సినిమాలో కొత్త నాని, సరికొత్త టైమింగ్ : నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్