Sunday, January 19, 2025
Homeసినిమానా కెరీర్ టాప్ ఆర్డర్ సినిమా అంటే సుందరానికీ : నాని

నా కెరీర్ టాప్ ఆర్డర్ సినిమా అంటే సుందరానికీ : నాని

This is best:  నేచురల్ స్టార్ నాని- నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ ‘అంటే సుందరానికీ‘. జూన్ 10 విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ ” టే సుందరానికీ  విజయం టీమ్ సమిష్టి కృషి.  బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు.. ఈ రోజు ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమని, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో  ఈ సినిమా   ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. దాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇది డా అలా అరుదైన సినిమానే”

“ఈ చిత్రానికి మరో చిత్రంతో పోలిక లేదు. ఇలా అరుదుగా వచ్చే సినిమాని మనం అందరం భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం భాగమౌతాం. ఇది మనందరి సినిమా. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్. ‘అంటే సుందరానికీ’ కి వస్తున్న రెస్పాన్స్, అభిమానులు పెడుతున్న మెసేజులు చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా వుంది. నా కెరీర్ టాప్ ఆర్డర్ లో వుండే సినిమా ‘అంటే సుందరానికీ’. సులువైన మార్గాలు చాలా వున్నపుడు ఇలాంటి అంటే సుందరానికీ లాంటి కథ చెప్పడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ మా దర్శకుడు వివేక్ ఆత్రేయలో వున్నాయి. మా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ లో వున్నాయి. నాలో, మా టీమ్ అందరిలో వున్నాయి. ఇది అవకాయ్ లాంటి సినిమా. మూడు రోజులు రుచి చూసారంటే రోజురోజుకి ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది. రెండేళ్ళ తర్వాత కూడా మంచి తెలుగు సినిమా పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పే రెండు మూడు పేర్లలో అంటే సుందరానికీ వుంటుంది” అన్నారు.

Also Read : అంటే సుందరానికీ’ అనే బ్లాక్ బస్టర్ తీశాం: నాని 

RELATED ARTICLES

Most Popular

న్యూస్