Sunday, January 19, 2025
Homeసినిమానానీకి హిట్ ఇచ్చిన వివేక్ ఆత్రేయ!

నానీకి హిట్ ఇచ్చిన వివేక్ ఆత్రేయ!

నాని తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి మంచి దూకుడు చూపిస్తూ వచ్చాడు. ఏడాదికి రెండు .. మూడు సినిమాలు తన వైపు నుంచి థియేటర్స్ కి వెళ్లేలా చూసుకున్నాడు. అలాంటి నాని ఈ మధ్య కాలంలో కాస్త స్పీడ్ తగ్గించాడనే చెప్పాలి. కంటెంట్ విషయంలో కసరత్తుకు ఆయన మరింత సమయం  తీసుకుంటున్నాడనే చెప్పాలి. అలా ఆయన చేసిన సినిమానే ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టైటిల్ నుంచే ఈ సినిమా ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. కంటెంట్ ఏమైవుంటుందా అని అంతా వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో హీరోకి కోపం ఎక్కువ .. అయితే ఆ కోపాన్ని అతను వెంటనే చూపించడు .. శనివారం వరకూ వెయిట్ చేస్తాడు. అప్పటివరకూ ఆగడం ఎందుకంటే .. అది తల్లికిచ్చిన మాట. అలా మాట ఎందుకిచ్చాడంటే, థియేటర్ కి వెళ్లి సినిమా చూడవలసిందే. అయితే తల్లికిచ్చిన ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేదే కథ.

హీరోకి ఒక లక్షణం ఉంటుంది. తనకళ్ల ముందు ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ మనిషిని తన మనిషిగా భావిస్తాడు .. ఆ సమస్యను తనదిగా భావించి పోరాడతాడు. ఇక విలన్ విషయానికొస్తే  ఒకరిపై కోపం వస్తే .. మరొకరిపై చూపించే టైపు. ఈ రెండు విభిన్నమైన మనస్తత్త్వాల మధ్య ఈ కథ నడుస్తూ ఉంటుంది. వివేక్ ఆత్రేయ ఈ కథను రాసుకున్న తీరు .. దానిని తెరపై ఆవిష్కరించిన విధానం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ‘అంటే .. సుందరానికీ’ సినిమాతో నాని అభిమానులను నిరాశపరిచిన ఈ దర్శకుడు, ఈ సినిమాతో నానీకి హిట్ ఇచ్చాడనే చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్