Super-Natural Stars: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట‘ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక మహేష్ బాబు.. తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నారు.
అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న భారీ చిత్రం కావడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రను ఓ యంగ్ హీరోతో చేయించాలనేది త్రివిక్రమ్ ప్లాన్.
అయితే.. ఆ పాత్రను నానితో చేయించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా పై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై అటు చిత్రయూనిట్ కానీ.. నాని కానీ స్పందించలేదు. దీంతో ఈ భారీ చిత్రంలో నాని నటించడం నిజమే అని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా..? కాదా అనేది తెలియాల్సివుంది.
Also Read : సర్కారు వారి పాట నాలుగు రోజుల కలెక్షన్స్